Telangana: రూ. 1,82,017 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేసీఆర్... హైలైట్స్-1

  • రైతు రుణమాఫీకి రూ. 6,000 కోట్లు
  • మిషన్ కాకతీయకు రూ. 22,500 కోట్లు
  • కల్యాణలక్ష్మి, షాది ముబారక్ కోసం రూ. 1,450 కోట్లు

తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ అన్ని విధాలుగా వెనుకబడిందని... రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నామని చెప్పారు. అన్ని రంగాలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నామని చెప్పారు. 2018-19లో తలసరి ఆదాయం రూ. 2.06 లక్షలకు చేరుకుందని చెప్పారు.  

బడ్జెట్ హైలైట్స్:

  • బడ్జెట్ - రూ. 1,82,017 కోట్లు
  • రెవెన్యూ వ్యయం రూ. 1,31,629 కోట్లు
  • మూలధన వ్యయం రూ. 32,815 కోట్లు
  • రెవెన్యూ మిగులు రూ. 6,564 కోట్లు
  • ఆర్థిక లోటు రూ. 27,749 కోట్లు (అంచనా)
  • 2018-19 ఆర్థిక వృద్ధి రేటు 10.6శాతం 

  • కల్యాణలక్ష్మి, షాది ముబారక్ కోసం రూ. 1,450 కోట్లు
  • రైతు రుణమాఫీకి రూ. 6,000 కోట్లు
  • ఆసరా పింఛన్లకు రూ. 12,067 కోట్లు
  • మిషన్ కాకతీయకు రూ. 22,500 కోట్లు
  • మైనార్టీల సంక్షేమానికి రూ. 2,004 కోట్లు
  • పీడీఎస్ బియ్యం సబ్సిడీకి రూ. 2,744 కోట్లు
  • రైతు బీమాకు రూ. 650 కోట్లు
  • నిరుద్యోగ భృతికి రూ. 1,810 కోట్లు.

More Telugu News