Andhra Pradesh: విజయవాడలో స్కూలు బస్సు బీభత్సం.. పల్టీలు కొట్టిన ఆటోలు, వాహనాలు!

  • ప్రైవేటు పాఠశాల బస్సు బ్రేక్ ఫెయిల్
  • ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు
  • బ్రేకులు ఫెయిల్ అవ్వడమే కారణమట 

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఓ ప్రైవేటు స్కూలు బస్సు రోడ్డుపై వెళుతున్న వారిని వణికించింది. వాహనాలను ఢీకొట్టుకుంటూ ముందుకు సాగింది. దీంతో పాదచారులు ప్రాణభయంతో పరుగులు తీశారు.

కాగా, బస్సు బలంగా ఢీకొట్టడంతో ఆటోలతో పాటు పలు వాహనాలు పల్టీలు కొట్టాయి. అనంతరం కొద్దిదూరం వెళ్లాక బస్సు ఆగిపోయింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వీరిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

బ్రేకులు ఫెయిల్ అవ్వడం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. కాగా, ఈ విషయమై పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం సేవించాడా? లేదా? అన్నది ఇంకా తెలియలేదని అన్నారు. డ్రైవర్ ను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపామన్నారు. విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకుంటామన్నారు.

More Telugu News