chaitu: 'మజిలీ' షూటింగ్ .. ఓ అద్భుతమైన అనుభవం: సమంత

  • శివ నిర్వాణ నుంచి 'మజిలీ'
  • సంగీత దర్శకుడిగా గోపీసుందర్
  •  ఏప్రిల్ 5వ తేదీన విడుదల    

ప్రేమకథా చిత్రమైన 'నిన్నుకోరి'ని శివ నిర్వాణ కొత్తకోణంలో ఆవిష్కరించి మంచి మార్కులు కొట్టేశాడు. కథాకథనాలు .. పాటల పరంగా ఈ సినిమా యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో తన తదుపరి చిత్రంగా ఆయన 'మజిలీ' సినిమాను రూపొందిస్తున్నాడు. నాగచైతన్య .. సమంత జంటగా ఈ సినిమా నిర్మితమవుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకుంది.

ఈ సినిమా షూటింగ్ పూర్తయిందనీ .. ఏప్రిల్ 5వ తేదీన విడుదలవుతుందని సమంత ట్వీట్ చేసింది. ఈ సినిమాకి పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవమనీ, ఇంత మంచి టీమ్ తో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందంటూ .. సినిమా టీమ్ తో దిగిన ఫొటోను షేర్ చేసింది. గోపీసుందర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. పెళ్లి తరువాత సమంత .. చైతూ కలిసి చేసిన ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి వుంది. ఈ సినిమా హిట్ కొడితే అది ఈ జంటకి ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందనే చెప్పాలి. 

More Telugu News