‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాపై స్పందించిన లక్ష్మీపార్వతి!

- సినిమాలో చంద్రబాబు గొప్పతనాన్ని చూపారట
- వ్యతిరేకంగా తీసేంత ధైర్యం బాలకృష్ణకు లేదు
- లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా
చంద్రబాబు ఎన్టీఆర్ కు చేసిన ద్రోహాన్ని బాలకృష్ణ చూపిస్తారని తనతో పాటు ఎవ్వరికీ నమ్మకం లేదని లక్ష్మీపార్వతి అన్నారు. తనను సినిమాలో చూపిస్తే ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయాన్ని సైతం చూపించాల్సి వస్తుందనీ, అందుకే తన పాత్రను పెట్టలేదని వ్యాఖ్యానించారు.
అందుకే ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతున్నారని అన్నారు. ఎన్టీఆర్ చివరి రోజుల్లో అనుభవించిన కష్టాలు, తమ అనుబంధం ప్రధానాంశంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఉంటుందని తెలిపారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.