nara brahmani: 'మహానాయకుడు'పై నారా బ్రహ్మణి స్పందన

  • 'మహానాయకుడు'ను అద్భుతంగా ఆవిష్కరించారు
  • తెలుగు వాళ్లంతా తప్పకుండా చూడాలి
  • అమ్మానాన్నలకు అభినందనలు  

ఎన్టీఆర్ బయోపిక్ లో రెండవ భాగమైన 'మహానాయకుడు'ను ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ సినిమా చూసిన తరువాత నారా బ్రహ్మణి స్పందిస్తూ .. తెలుగు చిత్రపరిశ్రమకి తాతగారు ఎంత గుర్తింపును తీసుకువచ్చారో 'కథానాయకుడు' సినిమాలో చూశాము. ఆ సినిమాకి మించిన స్థాయిలో 'మహానాయకుడు'ను అద్భుతంగా ఆవిష్కరించారు.

తెలుగు జాతికి ఆయన ఎంతటి గౌరవాన్ని తీసుకొచ్చారనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. ఒక తెలుగింటి ఆడపడుచుగా పుట్టడం చాలా గర్వంగా అనిపిస్తోంది. మహోన్నతమైన ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్నీ, ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలతో రూపొందించిన ఈ సినిమాను, ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారంతా చూడాలి. ఇంత గొప్ప ప్రయత్నాన్ని చేసిన సందర్భంగా, నా తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.

More Telugu News