raana: సాయిపల్లవితో సినిమా విషయంలో రానా క్లారిటీ ఇచ్చేశాడు

  • పరిశీలనలో 'విరాటపర్వం 1992' టైటిల్
  • నక్సలైట్ పాత్రలో సాయిపల్లవి
  • జూన్ నుంచి సెట్స్ పైకి         

రానా ఇప్పుడు తమిళ .. హిందీ సినిమాలతో బిజీగా వున్నాడు. వేణు ఊడుగుల దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయనున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో కథానాయికగా సాయిపల్లవిని తీసుకున్నారని చెప్పుకున్నారు. రానా పోలీస్ ఆఫీసర్ గా .. సాయిపల్లవి నక్సలైట్ గా కనిపిస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో, ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఈ విషయంపై రానా స్పందించాడు. వేణు ఊడుగుల దర్శకత్వంలో తన సినిమా వున్నట్టుగా చెప్పాడు. ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలో ఎంతమాత్రం నిజం లేదని అన్నాడు. ఈ సినిమాలో తను .. సాయిపల్లవి కలిసి నటించనున్నామనీ, ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పాడు. 'విరాట పర్వం 1992' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. జూన్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది.

More Telugu News