Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • సొంత చిత్రం పనుల్లో కాజల్ బిజీ 
  • ఆ సీక్వెల్ లో కూడా జగపతిబాబు?
  • మే నెలలో రానున్న 'అక్షర' 

*  అందాలతార కాజల్ అగర్వాల్ 'కేఏ' పేరిట సొంత చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ప్రస్తుతం 'కల్కి' చిత్రాన్ని రూపొందిస్తున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తొలి చిత్రాన్ని నిర్మించడానికి కాజల్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.  
*  గతంలో జగపతిబాబు హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'శుభలగ్నం' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో కూడా జగపతిబాబునే ప్రధాన పాత్రకు తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
*  నందిత శ్వేత కథానాయికగా చేస్తున్న తెలుగు చిత్రం 'అక్షర'. బి.చిన్ని కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. చిత్రాన్ని మే నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.  

More Telugu News