West Godavari District: చింతమనేని వ్యాఖ్యలతో కలత చెంది ఆ వీడియోను షేర్ చేశాను: నిందితుడు కత్తుల రవి

  • నేను విద్యావంతుడిని
  • ఆ వీడియోను మార్ఫింగ్, ఎడిటింగ్ చేయలేదు
  • అరెస్ట్ చేయాల్సింది నన్ను కాదు.. చింతమనేనినే

‘‘ఆ వీడియోను నేను మార్ఫింగ్ చేయలేదు. నాకు ఎవరో పంపితే సోషల్ మీడియాలో షేర్ చేశానంతే. నేను ఎస్సీని. చింతమనేని ఎస్సీలపై చేసిన వ్యాఖ్యలు నన్ను బాధించాయి. నేను విద్యావంతుడిని. నన్ను ఎవరూ ప్రలోభ పెట్టలేరు. నేనా వీడియోను మార్ఫింగ్, ఎడిటింగ్ చేయలేదు. అరెస్ట్ నన్ను కాదు.. చింతమనేనిని చేయాలి’’ అని మార్ఫింగ్ వీడియో నిందితుడు, ఏలూరుకు చెందిన కత్తుల రవి చెప్పుకొచ్చాడు.

చింతమనేని వీడియోను ఎడిట్ చేసిన వైరల్ చేసిన కేసులో అరెస్ట్ అయిన కత్తుల రవికి గురువారం బెయిలు మంజూరైంది. ఈ కేసుపై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్ మాట్లాడుతూ.. చింతమనేని చేసిన వ్యాఖ్యలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారని, దీని నిడివి 30 సెకన్లు అని పేర్కొన్నారు. ఇతురుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్న ఈ వీడియోను సృష్టించిన రవిపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. రవి తొలుత ఆ వీడియోను తన ఫేస్‌బుక్ ఖాతాలో పెట్టి ఆ తర్వాత యూట్యూబ్‌లో పెట్టాడని ఎస్పీ వివరించారు.

More Telugu News