allu sirish: 'ఏబీసీడీ' నుంచి 'మెల్లమెల్లమెల్లమెల్లగా' లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

  • అల్లు శిరీశ్ తాజా చిత్రంగా 'ఏబీసీడీ'
  • నాయికగా రుక్సాన్ 
  • మార్చి 1న విడుదల      

మంచి ప్రేమకథను చేయాలనే ఉద్దేశంతో వెయిట్ చేస్తూ అల్లు శిరీశ్ కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఈ సమయంలోనే ఆయన దృష్టి మలయాళ మూవీ 'ఏబీసీడీ'పై పడింది. అక్కడ ఈ సినిమా దుల్కర్ సల్మాన్ కి పెద్ద హిట్ ఇచ్చింది. ఈ సినిమా తెలుగు రీమేక్ లో చేయాలని శిరీశ్ అనుకోవడం ..  అదే పేరుతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లిపోవడం జరిగిపోయింది.

సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లు శిరీశ్ జోడీగా రుక్సాన్ ధిల్లాన్ నటించింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. "మెల్లమెల్లమెల్లమెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే .. మెల్లమెల్లమెల్లమెల్లగా కన్నుల్లో మత్తులాగా అల్లావే .. "అంటూ ఈ పాట సాగుతోంది. మేకింగ్ షాట్స్ పై కట్ చేసిన ఈ లిరికల్ వీడియో సాంగ్ ఆకట్టుకునేలా వుంది. జుడా శాండీ సంగీతం .. కృష్ణకాంత్ సాహిత్యం .. సిద్ శ్రీరామ్ - అదితి భావరాజు ఆలాపన బాగున్నాయి. మార్చి 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

More Telugu News