rakul: రకుల్ ను తప్పించేశారట .. ఆ స్థానంలో మరో యంగ్ హీరోయిన్

  • బాబీ దర్శకత్వంలో 'వెంకీమామ'
  • ఇటీవలే మొదలైన షూటింగ్
  • సంగీత దర్శకుడిగా తమన్

వరుసగా ఎదురవుతోన్న పరాజయాలు .. కొత్త కథానాయికల పోటీ కారణంగా రకుల్ ఇబ్బందుల్లోనే పడింది. ఇప్పటికే తెలుగులో చాలా వరకూ ఆమెకి అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ఆమె చేతిలో 'వెంకీమామ' వంటి పెద్ద సినిమా వుంది కదా అని అభిమానులు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా చేజారిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. బాబీ దర్శకత్వంలో వెంకటేశ్ .. నాగచైతన్య కథానాయకులుగా 'వెంకీమామ' రూపొందుతోంది.

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో మొదలైంది. ఈ సినిమాలో ఒక కథానాయికగా రకుల్ ను .. మరో కథానాయికగా పాయల్ రాజ్ పుత్ ను ఎంపిక చేసుకున్నట్టుగా ప్రచారం జరిగింది. కారణమేమిటనేది తెలియదుగానీ .. రకుల్ ని తప్పించి ఆ స్థానంలో నాభా నటేశ్ ను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. 'లవకుశ' తరువాత బాబీ చేస్తోన్న ఈ సినిమా, ఆయనకి మరో హిట్ ఇస్తుందేమో చూడాలి. 

More Telugu News