ajith: అజిత్ 'విశ్వాసం' నుంచి ఫస్టు లుక్

  • తమిళంలో భారీ హిట్ 
  • నాయికగా నయనతార
  •  మార్చి 1వ తేదీన విడుదల

అజిత్ .. నయనతార జంటగా రూపొందిన 'విశ్వాసం' తమిళంలో సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోగలిగింది. రజనీకాంత్ 'పేట'తో పోటీపడుతూ రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. అయితే ఆ సమయంలో తెలుగులో గట్టి పోటీ ఉండటంతో, ఆ ఆలోచనను విరమించుకున్నారు.

తాజాగా ఈ సినిమాను మార్చి 1వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని తెలియజేస్తూ ఫస్టులుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. యాక్షన్ కి .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటించింది. తమిళంలో భారీ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, తెలుగులో ఏ స్థాయి సందడి చేస్తుందో చూడాలి. 

More Telugu News