MLC notificaton: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది... శాసనసభ కోటాలో ఐదు స్థానాలకు నోటిఫికేషన్‌

  • మార్చి 12వ తేదీన ఎన్నికలు
  • నేటి నుంచి 28వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ
  • ఐదో తేదీ వరకు ఉపసంహరణకు గడువు

నేడా రేపా అని ఎదురు చూస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పలు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఐదు స్థానాలకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

శాసన సభ్యుల కోటాలో ఎన్నికైన పొంగులేటి సుధాకర్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, టి.సంతోష్‌కుమార్‌, మహ్మద్‌ సలీం, మహమూద్‌ అలీ పదవీ కాలం  పూర్తికావడంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి 12వ తేదీన పోలింగ్‌ నిర్వహించనున్నారు. అదేరోజు ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. ఇందుకు సంబంధించి నేటి నుంచి ఈనెల 28వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఒకటో తేదీన వాటిని పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఐదో తేదీ వరకు గడువు ఉంది. ఆ తర్వాత బరిలో ఉన్న అభ్యర్థులను అనుసరించి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. 

More Telugu News