pulwama attack: పుల్వామా కంటే భారీ ఉగ్రదాడికి జైషే ప్లాన్.. ఈసారి జమ్ము కశ్మీర్ వెలుపల: హెచ్చరించిన నిఘా వర్గాలు

  • గతేడాది డిసెంబరులో 21 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబాటు
  • వీరిలో ముగ్గురు ఆత్మాహుతి దాడి సభ్యులు
  • పుల్వామా దాడిలో ఒకరి మృతి.. మిగతా ఇద్దరు దాడికి రెడీ

పుల్వామా ఉగ్రాదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్  మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పుల్వామా దాడికంటే మరింత భారీ దాడి కోసం ప్రణాళిక రచించింది. ఈ నెల 16-17 మధ్య పాకిస్థాన్‌లోని జైషే మహ్మద్ అగ్రనేతలు- ఉగ్రవాదుల మధ్య ఈ మేరకు సంభాషణ జరిగినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

భారత భద్రతా దళాలపై మరింత పెద్ద ఎత్తున ఆత్మాహుతి దాడి నిర్వహించాలని ఉగ్రవాదులు ప్రణాళిక రూపొందించినట్టు చెబుతూ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారాన్ని బట్టి ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారి ఒకరు బుధవారం తెలిపారు.  

అయితే, జమ్మూలో లేదంటే జమ్ముకశ్మీర్ బయట ఈ దాడికి జైషే కుట్ర పన్నినట్టు పేర్కొన్నారు. ఇందుకోసం గతేడాది డిసెంబరులో ముగ్గురు ఆత్మాహుతి సభ్యులు సహా 21 మంది ఉగ్రవాదులు కశ్మీర్‌లోకి చొరబడినట్టు చెప్పారు. ఇందులో ఓ ఆత్మాహుతి దాడి సభ్యుడైన అదిల్ అహ్మద్ దర్ పుల్వామా దాడిలో పాల్గొనగా, ఇంకా ఇద్దరు దాడికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన వివరించారు.

More Telugu News