JC Diwakar Reddy: మా నాన్న వేరు, నేను వేరు.. ఆయనలా మాట్లాడలేను!: జేసీ కుమారుడు పవన్

  • జేసీ దివాకర్ రెడ్డి వారసుడిగా పవన్ రెడ్డి
  • లోక్ సభ ఎన్నికల్లో అనంతపురం నుంచి బరిలోకి!
  • జేసీ కుమారుడిని కావడం అదృష్టమంటున్న పవన్

జేసీ దివాకర్‌ రెడ్డి కుమారుడిగా పుట్టడం తన అదృష్టమని జేసీ పవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయనలా తాను ఎప్పటికీ ఉండలేనని అన్నారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందుకోవాలని భావిస్తున్న పవన్ గత కొంతకాలంగా అనంతపురం పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తన మనస్తత్వం వేరని, తండ్రిలా మాట్లాడలేనని అంటున్న పవన్, వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయనున్నానన్న సంకేతాలిస్తూనే, ప్రజలు తనకు అండగా ఉండాలని కోరుతున్నారు.

తన తండ్రి ప్రజలందరికీ తెలిసిన నేత కాబట్టి, ప్రజలు తనను ఆప్యాయంగా పలకరిస్తున్నారని, చూసేందుకు వస్తున్నారని, ఆయనకున్న పేరును తాను నిలబెడతానని పవన్ రెడ్డి అన్నారు. ఈ సంవత్సరం తాగునీటికి కష్టకాలం రావచ్చని, దాన్ని ఎదుర్కొనేందుకు అధికారులకు తోడుగా తాను కూడా సొంత నిధులతో సిద్ధంగా ఉన్నానని అన్నారు. జేసీ కుమారుడిగా తాను సంపాదించుకున్న పరిచయాలను గ్రామాభివృద్ధికి వినియోగిస్తానని హామీ ఇచ్చారు. కాగా, ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని సీఎం చంద్రబాబు వద్ద జేసీ కోరగా, అందుకు సానుకూల స్పందన వచ్చినట్టు తెలుస్తోంది.

More Telugu News