Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • తొలిసారిగా రకుల్ ఐటెం సాంగ్?
  • 'ఎఫ్ 2' సీక్వెల్ లో నితిన్ 
  • మార్చ్ 1న వస్తున్న 'విశ్వాసం'

*  అందాలభామ రకుల్ ప్రీత్ సింగ్ తొలిసారిగా ఐటమ్ సాంగు చేయనుంది. నాని హీరోగా విక్రం కుమార్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఓ ఐటమ్ పాట వుందట. దాని కోసం రకుల్ ని ఎంచుకున్నారని తెలుస్తోంది.
*  ఈ సంక్రాంతికి విడుదలైన 'ఎఫ్ 2' చిత్రం ఎంతటి విజయం సాధించిందో సినీ ప్రేక్షకులకు తెలుసు. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తామని నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు. ఈ సీక్వెల్ లో వెంకటేశ్, వరుణ్ తేజ్ లతో పాటు రవితేజ కూడా ఉంటాడని వార్తలొచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం రవితేజ బదులు నితిన్ ను తీసుకోనున్నారు.
*  అజిత్, నయనతార జంటగా తమిళంలో వచ్చిన 'విశ్వాసం' చిత్రం బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించింది. కాగా, ఈ చిత్రాన్ని అదే పేరిట తెలుగులోకి డబ్ చేశారు. ఈ తెలుగు వెర్షన్ ని మార్చ్ 1న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

More Telugu News