masood azhar: పరిస్థితి బాగోలేదు.. కొన్ని రోజులు సైలెంట్ గా ఉండండి: హఫీజ్ సయీద్, మసూద్ అజార్ లకు పాకిస్థాన్ సూచన

  • బహిరంగ ప్రదేశాల్లో కనిపించవద్దు.. ప్రసంగాలు వద్దు
  • లోప్రొఫైల్ మెయింటైన్ చేయండి
  • పుల్వామా దాడితో అంతర్జాతీయ సమాజం ముందు దోషిలా నిలబడ్డ పాక్

పుల్వామా ఉగ్రదాడితో పాకిస్థాన్ పరిస్థితి ఘోరంగా మారింది. అంతర్జాతీయ సమాజం ఈ దారుణాన్ని ముక్త కంఠంతో ఖండిస్తోంది. భారత్ కు అండగా ఉంటామని హామీ ఇస్తోంది. ఉగ్రవాదులను ఉక్కుపాదంతో అణచివేసే విషయంలో భారత్ కు పూర్తి స్థాయిలో సహకరిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో, కుడితిలో పడిన ఎలుకలా పాకిస్థాన్ పరిస్థితి తయారయింది.

మరోవైపు, మరిన్ని ఇబ్బందులు ఎదురు కాకుండా దిద్దుబాటు చర్యలకు పాకిస్థాన్ దిగింది. కొంత కాలం మౌనంగా ఉండాలంటూ పుల్వామా ఘటనకు బాధ్యుడైన జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్, 26/11 ముంబై దాడుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ లకు సూచించినట్టు విశ్వసనీయ సమాచారం. బహిరంగ ప్రదేశాల్లో కనిపించవద్దని, ప్రసంగాలు ఇవ్వరాదని వీరిని కోరింది. లోప్రొఫైల్ మెయింటైన్ చేయాలని సూచించింది.

More Telugu News