రేపు రాజమండ్రిలో శక్తి కేంద్రాల సమ్మేళనం.. హాజరుకానున్న అమిత్‌ షా

20-02-2019 Wed 11:00
  • ఉదయం 10.30 గంటలకు రానున్న బీజేపీ చీఫ్‌
  • లాలాచెరువు సమీపంలో సభ
  • ఉభయ గోదావరి జిల్లాల ప్రముఖులు హాజరు

ఉభయ గోదావరి, రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లాల శక్తి కేంద్రాల సమ్మేళనం గురువారం ఉదయం రాజమండ్రిలో జరగనుంది. ఈ సమ్మేళనానికి భారతీయ జనతా పార్టీ చీఫ్‌ అమిత్‌ షా హాజరుకానున్నారు. రాజమండ్రి లాలాచెరువు సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఈ సమ్మేళనానికి హాజరయ్యేందుకు ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో అమిత్‌షా రాజమండ్రి చేరుకుంటారు. మధురపూడి విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన సభాస్థలికి విచ్చేయనున్నారు. సమ్మేళనం పూర్తయ్యాక మధ్యాహ్నం ఆయన క్వారీ మార్కెట్‌ సెంటర్‌లో నిర్మించిన బీజేపీ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. భోజన విరామం అనంతరం తిరిగి బయలుదేరుతారు.