Telugudesam: టీడీపీ మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం నేడు

  • యనమల చైర్మన్‌గా కమిటీ ఏర్పాటు చేసిన చంద్రబాబు
  • కాల్వ శ్రీనివాసులకు కన్వీనర్‌గా బాధ్యతలు
  • పలువురు మంత్రులకు చోటు

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకుపోయేందుకు వీలైన పథకాల రూపకల్పన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసిన ఎన్నికల మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం ఈరోజు మధ్యాహ్నం జరగనుంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీ వ్యూహ రచనకు పదును పెడుతున్న అధినేత, సీనియర్‌ నాయకుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేశారు. మంత్రి కాల్వ శ్రీనివాసులును కన్వీనర్ గా నియమించారు. ప్రజల్ని మెప్పించి ఒప్పించి ఓట్లు సాధించేందుకు వీలుగా ఏ పథకాలతో ముందుకు వెళ్లాలన్న దానిపై ఈ కమిటీ చర్చించి నిర్ణయాలను అధినేత ముందుంచుతుంది.

కమిటీలో  మంత్రులు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, ఫరూక్, నక్కా ఆనందబాబు, కిడారి శ్రావణ్ కుమార్, శాసన మండలి విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, వాసుపల్లి గణేష్ కుమార్, భూమా బ్రహ్మానందరెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు, టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ, విజయనగరం జడ్పీ మాజీ చైర్మెన్ శోభా స్వాతి రాణి, ఏపీఐఐసీ చైర్మెన్ కృష్ణయ్య ఇతర సభ్యులు. కమిటీ తొలి సమావేశం మధ్యాహ్నం సచివాలయంలో జరగనుంది. 

More Telugu News