Shahid Afridi: అందులో ఎటువంటి సందేహం లేదు.. ప్రతీకారం తీర్చుకుంటాం: ఇమ్రాన్ వ్యాఖ్యలకు అఫ్రిది మద్దతు

  • భారత్ దాడిచేస్తే తాము చేతులు ముడుచుకుని కూర్చోబోమన్న ఇమ్రాన్
  • దెబ్బకు దెబ్బ తీస్తామని హెచ్చరిక
  • చేతులు ముడుచుకుని కూర్చోమన్న అఫ్రిది

పుల్వామా ఆత్మాహుతి దాడి విషయంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలకు ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది స్పందించాడు. ఇమ్రాన్‌కు అండగా నిలిచాడు. ‘‘ఈ విషయంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు’’ అని అఫ్రిది ట్వీట్ చేశాడు. మంగళవారం ఇమ్రాన్ మాట్లాడుతూ... ‘‘ఇండియా ప్రతీకార దాడికి దిగుతుందని అనుకోవడం లేదు.. ఒకవేళ దిగితే కనుక తగిన బుద్ధి చెబుతాం. మీరు దాడి చేస్తే మేం చేతులు ముడుచుకుని కూర్చుంటామని మీరు(భారత్) భావిస్తుండొచ్చు. కానీ అది తప్పు. మేం కూడా సరైన సమాధానం చెబుతాం’’ అని హెచ్చరించారు.

ఇమ్రాన్ వ్యాఖ్యలకు స్పందించిన అఫ్రిది ఈ మేరకు ట్వీట్ చేశాడు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదంటూ రెచ్చగొట్టే ట్వీట్ చేశాడు. పాకిస్థాన్‌తో చర్చలు అనవసరమని, యుద్ధమే పరిష్కారమని పుల్వామా ఘటన తర్వాత టీమిండియా మాజీ క్రికెటర్ గంభీర్ చేసిన ట్వీట్‌కు ‘అతడికేమైంది?’ అని ముక్తసరిగా సమాధానం ఇచ్చిన అఫ్రిది.. ఇప్పుడు పాక్ ప్రధానికి వంత పాడడం గమనార్హం.

More Telugu News