Sun: పగటి పూట ఎండ, రాత్రి పూట ఉక్కపోత!

  • ఎండ తీవ్రత మరింతగా పెరగనుంది
  • హెచ్చరించిన వాతావరణ శాఖ
  • కరెంటుకు పెరిగిన డిమాండ్

తెలుగు రాష్ట్రాల్లో పగటి పూట ఉష్ణోగ్రత పెరుగుతుండగా, రాత్రి వేళల్లో ఉక్కపోత మొదలైంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా వేడెక్కుతున్నాయని, రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత అధికం కానుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. చలి గాలుల తీవ్రత తగ్గీతగ్గగానే, భానుడి భగభగ మొదలైపోయింది. పగలు పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా కనీసం అరగంట పాటు ఆరు బయట పని చేసుకునే పరిస్థితి లేకుండాపోయింది. నిన్నమొన్నటి వరకూ తెల్లవారుజామున చలిగా అనిపించగా, ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. రాత్రి సమయంలో ఉష్ణోగ్రత పెరగడంతో ఉక్కపోతకు తాళలేక ఏసీలను వాడటం ప్రారంభమైంది. దీంతో తెలంగాణలో కరెంటుకు డిమాండ్ స్వల్పంగా పెరిగింది.

More Telugu News