Jana Sena: ‘జనసేన’కు బయోడేటా అందజేసిన యువ క్రికెటర్ వేణుగోపాలరావు

  • తమ బయోడేలాలు అందజేస్తేన్న ఆశావహులు
  • స్క్రీనింగ్ కమిటీ ముందుకు 150  బయోడేటాలు 
  • ఓ ప్రకటన విడుదల చేసిన జనసేన పార్టీ

వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున చేయాలనుకున్న ఆశావహులు తమ బయోడేటాలను అందజేసే కార్యక్రమం కొనసాగుతోంది. విజయవాలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు 150 మంది ఆశావహులు తమ బయో డేటాలను స్క్రీనింగ్ కమిటీకి సమర్పించారు. జనసేన అభ్యర్థిత్వం ఆశిస్తున్న యువ క్రికెట్ వేణుగోపాలరావు కూడా తన బయోడేటాను స్క్రీనింగ్ కమిటీకి అందజేశాడు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇంకా తమకు బయోడేటాలు సమర్పించిన వారిలో మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, జనసేన నేతలు సత్య బొలిశెట్టి, ముత్తంశెట్టి కృష్ణారావు, గిరిజన, ఎస్సీ హక్కుల కోసం పోరాడిన వారు, భూసేకరణ అమలులో లోపాలపై న్యాయపోరాటాలు చేసిన వారు, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల తరపున, ఆ ప్రాంతంలో ఎస్టీల పక్షాన నిలిచిన నాయకులు, రాయలసీమ ప్రాంతం నుంచి నలుగురు పాత్రికేయులు, పదవీ విరమణ పొందిన సైనికాధికారులు, సైనికులు, ముంబైలోని తాజ్ హోటల్ పై ఉగ్రదాడి జరిగినప్పుడు నిర్వహించిన ‘కమెండో ఆపరేషన్స్’లో పాల్గొన్న ఓ విశ్రాంత అధికారి తమ బయోడేటాలు సమర్పించినట్టు ‘జనసేన’ పేర్కొంది.

More Telugu News