బెంగళూరులో ఆకాశంలో ఢీకొన్న రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు!

- బెంగళూరులో ఏరో ఇండియా ప్రదర్శన
- రిహార్సల్స్ జరుగుతుండగా అపశ్రుతి
- ప్రాణాలతో బయటపడ్డ పైలట్లు
ఇవి రెండూ హక్ ట్రయినర్ జెట్ విమానాలని, సూర్యకిరణ్ ఏరోబెటిక్ టీమ్ లో భాగంగా ప్రదర్శనలో పాల్గొంటున్నాయని, గాల్లో ఢీకొన్న విమానాలు నిర్మానుష్య ప్రాంతంలో కూలడంతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు తెలిపారు. ఈ ఘటన తరువాత ఎయిర్ షో రిహార్సల్స్ ను అధికారులు నిలిపివేశారు. అధికారికంగా రేపటి నుంచి ఐదు రోజుల పాటు ప్రదర్శన జరుగనుండగా, నేడు రిహార్సల్స్ జరుగుతున్నాయి.