Andhra Pradesh: రఘువీరా ఇంటిలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కమిటీ భేటీ.. దరఖాస్తుల వడపోత!

  • అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో సమావేశం
  • హాజరైన ఊమెన్ చాందీ, పళ్లం రాజు తదితరులు
  • నేడు ప్రత్యేకహోదా భరోసా ప్రజాయాత్ర

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు అనంతపురం జిల్లాలో నేతలు సమావేశమయ్యారు. మడకశిర మండలం నీలకంఠాపురంలోని పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఇంట్లో అభ్యర్థుల ఎంపిక కమిటీ సమావేశం జరుగుతోంది. రాబోయే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల దరఖాస్తులను నేతలు పరిశీలిస్తున్నారు. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డితో పాటు ఏపీ ఇన్ చార్జి ఊమెన్ చాందీ, కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏపీ ఇన్ చార్జి ఊమెన్ చాందీ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ 2014లోనే హామీ ఇచ్చిందని తెలిపారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ కు హోదా ఇస్తామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మరికాసేపట్లో ప్రత్యేకహోదా భరోసా ప్రజాయాత్రను నిర్వహిస్తామని పేర్కొన్నారు.

More Telugu News