avasarala: అవసరాల కథానాయకుడిగా 'నాయనా .. రారా ఇంటికి'

  • అవసరాల హీరోగా మరో సినిమా
  • ఈ నెల 20వ తేదీన లాంచ్
  •  కథానాయికగా మహతి 

అవసరాల శ్రీనివాస్ ఒక వైపున దర్శకుడిగా .. మరో వైపున నటుడిగా తన సత్తా చాటుకున్నాడు. దర్శకుడిగా తన తదుపరి సినిమాకి ఏర్పాట్లు చేసుకుంటూనే, నటుడిగా తనకి నచ్చిన కథలకి ఓకే చెప్పేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన బాల రాజశేఖర్ దర్శకత్వంలో .. ప్రదీప్ నిర్మాణంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

ఈ సినిమాకి 'నాయనా ..! రారా ఇంటికి'( ఎన్ ఆర్ ఐ) అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. ఈ సినిమాలో అవసరాల సరసన నాయికగా మహతి తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఇక నాగబాబు .. మంచు లక్ష్మి ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నెల 20వ తేదీన ఉదయం 11 గంటల 30 నిమిషాలకి, హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు.

More Telugu News