t-congress: నాపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు: రేవంత్ రెడ్డి

  • అసెంబ్లీ ఎన్నికలప్పుడు రూ.150 కోట్లు సీజ్ చేశారు
  • నాపై చార్జిషీట్ వేశారుగా మళ్లీ ఈడీకి ఎందుకు?
  • నన్ను రాజకీయంగా వేధించేందుకు ఈడీకి అప్పగించారు

తనపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని టీ-కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రూ.150 కోట్లు సీజ్ చేశారని, మరి, అందరిపైనా ఈడీ కేసు పెట్టారా? పట్నం నరేందర్ రెడ్డి దగ్గర రూ.50 లక్షలు దొరికాయని, మరి, ఆయనపై ఈడీ కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

తనపై చార్జిషీట్ వేసిన తర్వాత మళ్లీ ఈడీకి ఎందుకు అప్పగించారని, కేవలం, తనను రాజకీయంగా వేధించేందుకే తనపై ఈడీ కేసు పెట్టారని విమర్శించారు. కేసీఆర్-మోదీ ఒక్కటయ్యారు కనుకే తనపై ఈడీ కేసు పెట్టారని, వాళ్లిద్దరిదీ ‘ఫెవికాల్’ బంధమని విమర్శించారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తల్లి చనిపోతే, కేసీఆర్ రెండు సార్లు వెళ్లి వచ్చారని, దేశం కోసం చనిపోయిన జవాన్లకు నివాళులర్పించే సమయం మాత్రం కేసీఆర్ కు లేదని విమర్శించారు. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై అంతర్గతంగా చర్చిస్తామని అన్నారు.  

More Telugu News