Mahesh Babu: మహేశ్ మూవీ విషయంలోను అదే సెంటిమెంట్ తో అనిల్ రావిపూడి

  • మహేశ్ బాబుతో అనిల్ రావిపూడి
  • ఇంగ్లిష్ టైటిల్స్ కి ప్రాధాన్యత
  •  పూర్తి వినోదభరితంగా సాగే కథ  

మహేశ్ బాబు తన 25వ సినిమాగా 'మహర్షి' చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేసే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా అనిల్ రావిపూడి 'వాట్సాప్' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించాడు. మహేశ్ బాబు మూవీ కోసమే ఈ టైటిల్ ను సెట్ చేయనున్నట్టు ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.

ఇంతవరకూ అనిల్ రావిపూడి తన సినిమాలకి 'సుప్రీమ్' .. 'రాజా ది గ్రేట్'.. 'ఎఫ్ 2' అంటూ ఇంగ్లిష్ టైటిల్స్  పెడుతూ వచ్చాడు. ఈ సారి మాత్రం తన సినిమాకి తెలుగు టైటిల్ ఉంటుంది అని ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే ఇంగ్లిష్ టైటిల్స్ అచ్చొచ్చాయని అనుకున్నాడో ఏమో, అదే సెంటిమెంట్ తో ఈ సారి కూడా ఇంగ్లిష్ టైటిల్ తోనే సెట్స్ పైకి వెళుతున్నాడని తెలుస్తోంది. మహేశ్ తో సినిమాను ఆయన పూర్తి వినోదభరితంగా రూపొందించనున్నట్టు చెప్పుకుంటున్నారు.

More Telugu News