Anushka Shetty: అనుష్క తాజా చిత్రంలో కీలకమైన పాత్రలో రానా

  • హేమంత్ మధుకర్ నుంచి 'సైలెన్స్'
  • ముఖ్యమైన పాత్రలో మాధవన్ 
  • మార్చి నుంచి అమెరికాలో షూటింగ్  

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రధారిగా ఒక మూవీ నిర్మితం కానుంది. ఈ సినిమాకి 'సైలెన్స్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. సినిమా మొత్తం మీద అనుష్క ఒక్కమాట కూడా మాట్లాడదట .. ఎంతో వైవిధ్యభరితంగా ఆమె పాత్రను తీర్చిదిద్దినట్టుగా తెలుస్తోంది. హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సన్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.మాధవన్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనుండగా .. మరో ముఖ్యమైన పాత్ర కోసం రానాను ఎంపిక చేసుకున్నట్టుగా తాజా సమాచారం. అనుష్కతో గల స్నేహం కారణంగానే ఈ పాత్రను చేయడానికి రానా అంగీకరించాడని అంటున్నారు. కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరగనుంది. మార్చి నుంచి ఏకధాటిగా అక్కడ ఈ సినిమా షూటింగ్ జరపనున్నారు. రానా రాకతో క్రేజ్ పెంచుకున్న ఈ ప్రాజెక్టులో ఇంకా ఎవరెవరు జాయిన్ అవుతారో చూడాలి. 

More Telugu News