maoist: మహిళా మావోయిస్టుకు రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన జవాను

  • జార్ఖండ్ లోని పశ్చిమ సింగ్ భమ్ లో ఘటన
  • బలగాలు, మావోల మధ్య ఎదురుకాల్పులు
  • బుల్లెట్ తగిలి తీవ్రంగా గాయపడ్డ మహిళా మావోయిస్టు

సీఆర్పీఎఫ్ జవాన్లు మానవత్వాన్ని ప్రదర్శించారు. ఓ ఎన్ కౌంటర్ లో తీవ్రంగా గాయపడ్డ మహిళా మావోయిస్టుకు రక్తదానం చేసి ఆమె ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన జార్ఖండ్ లోని పశ్చిమ సింగ్ భమ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, పశ్చిమ సింగ్ భమ్ ప్రాంతంలో 24 మంది మావోయిస్టులు సమావేశమైనట్టు 14వ తేదీన సమాచారం అందింది. దీంతో సీఆర్పీఎఫ్, ప్రత్యేక పోలీసుల బృందాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి.

ఈ సందర్భంగా మావోయిస్టులను చుట్టుముట్టిన బలగాలు వారిని లొంగిపోవాలని కోరాయి. కానీ, మావోలు మందుపాతరను పేల్చి, కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు యత్నించారు. దీంతో, బలగాలు కూడా ఎదురుకాల్పులను ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో, కాల్పులు జరిగిన స్థలంలో బుల్లెట్ తగిలి, తీవ్రంగా గాయపడ్డ మహిళా మావోయిస్టును బలగాలు గుర్తించాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రాణాలను కాపాడేందుకు ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు రక్త దానం చేశారు.

More Telugu News