TSRTV: టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం... కిడ్నీ రోగులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం!

  • 7,600 మందికి లబ్ది
  • పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, మెట్రో, డీలక్స్ బస్సుల్లో ప్రయాణం
  • రూ. 12.22 కోట్ల నష్టమన్న సునీల్ శర్మ

కిడ్నీ వ్యాధులతో బాధపడుతుతూ, డయాలసిస్ నిమిత్తం ప్రయాణాలు చేసే వారికి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఆరోగ్య శ్రీ పథకం కింద ఈ స్కీమ్ ను అమలు చేస్తామని, రాష్ట్రంలోని  7,600 మందికి పైగా రోగులకు లాభం చేకూరుతుందని సంస్థ ఇన్ చార్జ్ ఎండీ సునీల్ శర్మ వ్యాఖ్యానించారు. పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో వీరు ప్రయాణించవచ్చని, హైదరాబాద్, వరంగల్ నగరాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సులు, డీలక్స్ బస్సులు ఎక్కవచ్చని తెలిపారు. ఈ స్కీమ్ అమలు చేస్తే రూ. 12.22 కోట్ల భారం టీఎస్ఆర్టీసీపై పడుతుందని, దీన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేయనుందని ఆయన వెల్లడించారు.

More Telugu News