RBI: ఈ యాప్ వాడితే మీ డబ్బులు మటాష్: ఆర్బీఐ హెచ్చరిక

  • 'ఎనీ డెస్క్' యాప్ లో లోపాలు
  • వాడుతున్న వారి డబ్బులు మాయం
  • దూరంగా ఉండాలంటున్న ఆర్బీఐ

యునైటెడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ ఫేస్‌ (యూపీఐ) మాధ్యమంగా ఆన్‌ లైన్‌ చెల్లింపుల సేవలందిస్తున్న 'ఎనీ డెస్క్‌' స్మార్ట్ ఫోన్ యాప్ ను వాడరాదని ఆర్బీఐ హెచ్చరించింది. 'ఎనీ డెస్క్‌' వ్యవస్థపై మోసాలు జరుగుతున్నాయంటూ బ్యాంకులు, యాప్ వాడకందారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ యాప్ ద్వారా డబ్బు మాయం అవుతోందని పేర్కొంది.

ఈ యాప్‌ ఇన్ స్టాల్ చేసుకున్న వినియోగదారుల ఫోన్లను తమ అధీనంలోకి తీసుకొని, వారి ఖాతాల్లోని డబ్బును దుండగులు మాయం చేస్తున్నట్టు తేలిందని వెల్లడించింది. ఈ మేరకు ఆర్‌బీఐ సైబర్‌ భద్రత, ఐటీ పరిశోధన విభాగం ఓ ప్రకటనను విడుదల చేస్తూ, మొబైల్‌ వ్యాలెట్‌ లు, బ్యాంకింగ్‌ యాప్‌ లలోనూ అవకతవకలు జరుగుతున్నాయని తెలిపింది. 'ఎనీ డెస్క్‌' యాప్‌ లో లోపాలున్నాయని, వాటిని అలుసుగా తీసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతుండవచ్చని అభిప్రాయపడింది.

More Telugu News