CCI: పుల్వామా ఎఫెక్ట్.. ఇమ్రాన్ ఫొటోను కప్పేసిన క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా

  • సీసీఐలో పలువురి క్రికెటర్ల ఫొటోలు
  • ఇమ్రాన్ ఫొటోను కప్పేసి నిరసన
  • పాక్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన సీసీఐ చీఫ్

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌లోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చిత్రపటాన్ని కప్పేసి నిరసన వ్యక్తం చేసింది. ముంబైలో ఉన్న ఈ క్లబ్‌ రెస్టారెంట్‌లో పలువురు తాజా, మాజీ క్రికెటర్ల చిత్ర పటాలు ఉన్నాయి. ఇందులో 1992లో పాకిస్థాన్‌కు ప్రపంచకప్ అందించిన ఇమ్రాన్ ఖాన్ చిత్రపటం కూడా ఉంది.

అయితే, పుల్వామా ఉగ్రదాడి వెనక పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ హస్తం ఉందని తేలడంతో సీసీఐ తన నిరసనను తెలియజేసింది. క్లబ్‌లో ఉన్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఫొటోను కవర్ చేయడం ద్వారా తమ నిరసనను, అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సీసీఐ అధ్యక్షుడు ప్రేమల్ ఉదాని పేర్కొన్నారు.

More Telugu News