Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • డ్యాన్సర్ పాత్రలో తమన్నా 
  • హిట్ కాంబినేషన్లో మరో సినిమా
  • రెండో షెడ్యూల్ లో 'అక్షర'    

 *  చిరంజీవి హీరోగా నటిస్తున్న 'సైరా' చిత్రంలో అందాలభామ తమన్నా ఓ డ్యాన్సర్ పాత్రలో కనిపిస్తుందట. దేశభక్తి నిండిన డ్యాన్సర్ గా ఆమె పాత్ర చిత్రానికి ఓ హైలైట్ అవుతుందని అంటున్నారు.
*  తమిళ హీరో సూర్య, దర్శకుడు గౌతమ్ మీనన్ కాంబినేషన్లో గతంలో హిట్ చిత్రాలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు ఈ కాంబోలో మరో భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఈ చిత్రం పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.
*  నందిత శ్వేత ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం 'అక్షర'. బి.చిన్నికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. నందిత ఇందులో ఫిజిక్స్ లెక్చరర్ పాత్రలో కనిపిస్తుందట.

More Telugu News