balakrishna: 'మహానాయకుడు' రిలీజ్ డేట్ ఖరారు .. సెన్సార్ పూర్తి

  • 'మహానాయకుడు'కి 'యు' సర్టిఫికెట్
  •  హైలైట్ కానున్న రానా పాత్ర
  •  ఈ నెల 22వ తేదీన విడుదల  

ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి భాగమైన 'కథానాయకుడు' సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాగా, రెండవ భాగమైన 'మహానాయకుడు' విడుదలకి ముస్తాబవుతోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, క్లీన్ 'యు' సర్టిఫికెట్ ను తెచ్చుకుంది.

ఈ సినిమాను ఈ నెల 22వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఆ తరువాత 'అతి త్వరలో విడుదల'అనే పోస్టర్ వదిలారు. దాంతో అంతా అయోమయానికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా వదిలిన పోస్టర్ లో ఈ నెల 22వ తేదీని రిలీజ్ డేట్ గా చెబుతూ .. ఆ తేదీని ఖరారు చేసేశారు.

'కథానాయకుడు'నిడివి 2 గంటల 45 నిమిషాలు ఉండటంతో, ఆడియన్స్ కి అసహనాన్ని కలిగించిందనే రిపోర్ట్ క్రిష్ కి రావడం వలన, 'మహానాయకుడు' నిడివి 2 గంటల 8 నిమిషాలు మాత్రమే ఉండేలా ఆయన చూసుకున్నారట. 'మహానాయకుడు'లో రానా పాత్ర హైలైట్ అవుతుందని చెప్పుకుంటున్నారు.

More Telugu News