gollapudi: అలా నటుడిగా నా ప్రయాణం మొదలైంది: గొల్లపూడి మారుతీరావు

  • సరదాగా నటిచాలనిపించింది
  •  'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య'తో మొదలు
  •  39 సంవత్సరాలు .. 300 సినిమాలు       

నాటక రచయితగా .. సినీ రచయితగా .. నటుడిగా గొల్లపూడి మారుతీరావు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను సినీ నటుడిగా ఎలా మారింది ప్రస్తావించారు. 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' సినిమాకి పనిచేస్తున్న సమయంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆత్రేయ .. దాశరథి .. ఆరుద్ర సరదాగా చిన్నవేషాల్లో తెరపై కనిపించారు. అందువలన తెరపై నన్ను నేను చూసుకోవాలనే కోరిక నాక్కూడా కలిగింది.

ఆ సమయంలోనే 'గురువుగారూ సినిమాల్లో నటిస్తారా?' అని కోడి రామకృష్ణ అడిగాడు .. అప్పటికి నాకు 42 యేళ్లు. 'సరదాగా ఒక వేషం వేయాలనుందయ్యా' అన్నాను నేను. అంతే, ఆయన సంతోషంతో ఎగిరిగంతేశాడు. వెంటనే నిర్మాత రాఘవగారికి ఫోన్ చేసి ఆ విషయం చెప్పాడు. దాంతో నేను నటిస్తానంటేనే ఆ సినిమా తీస్తానని ఆయన పట్టుబట్టాడు. మీరు చేయవలసిందేనని కోడి రామకృష్ణ గొడవ. ఈ వయసులో నటనవైపు వెళ్లి నేను సాధించేదేవుంటుందని అనుకున్నాను. అలా సరదాగా 'ఇంట్లోరామయ్య వీధిలో కృష్ణయ్య'తో నటన వైపు వెళ్లిన నేను, 39 సంవత్సరాలపాటు నటుడిగా కొనసాగుతూ .. 300 సినిమాలకి పైగా చేయడం విశేషం" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News