nitish kumar: బీహార్ వసతి గృహాల కేసు: సీఎం నితీష్ కుమార్ ను కూడా విచారించమంటూ సీబీఐకి కోర్టు ఆదేశాలు

  • వసతి గృహాల వివరాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ప్రత్యేక కోర్టు ఆగ్రహం
  • నితీష్ తో పాటు మరో ఇద్దరిని దర్యాప్తు చేయాలంటూ సీబీఐకి ఆదేశం
  • వేగవంతమైన వసతి గృహాల్లో బాలికలపై అత్యాచారాల కేసు విచారణ

బీహార్ వసతి గృహాల్లో బాలికలపై అత్యాచారాలకు సంబంధించిన కేసు విచారణ వేగవంతమవుతోంది. ఈ కేసు విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కూడా విచారించాల్సిందిగా సీబీఐను ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్యువల్ అఫెన్సెస్ ప్రత్యేక కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. నితీష్ తో పాటు ముజఫర్ పూర్ కలెక్టర్ ధర్మేంద్ర సింగ్, రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ ప్రిన్సపల్ సెక్రటరీ అతుల్ ప్రసాద్ లను కూడా విచారించాలని ఆదేశించింది. వసతి గృహాల వివరాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

More Telugu News