Andhra Pradesh: తెలుగు భాషకు అంతర్జాతీయ గౌరవం.. అత్యంత వేగవంతమైన భాషగా రికార్డు!

  • ఆస్ట్రియా ప్రొఫెసర్ గెర్ట్రాడ్ ఫెంక్-ఒక్జలాన్ పరిశోధన
  • వేర్వేరు భాషల్లోని పదాల అనువాదం
  • తెలుగును సులభంగా, వేగంగా చదివిన అభ్యర్థులు

‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’గా పేరుగాంచిన తెలుగు భాషకు మరో గౌరవం దక్కింది. ప్రపంచంలోనే వేగంగా మాట్లాడే భాషగా తెలుగు అగ్రస్థానంలో నిలిచింది. ఇక జపనీస్ రెండో స్థానంలో నిలవగా థాయ్, వియత్నమీస్ భాషలు జాబితాలో చిట్టచివరి స్థానం దక్కించుకున్నాయి.  ఆస్ట్రియాలోని క్లాగెన్‌ఫర్ట్ యూనివర్సిటీలోని భాషా శాస్త్రం విభాగానికి చెందిన ప్రొఫెసర్ గెర్ట్రాడ్ ఫెంక్-ఒక్జలాన్ ఈ పరిశోధన చేపట్టారు. ఇందులో భాగంగా 51 భాషలు మాట్లాడే వేర్వేరు ప్రాంతాల వారిని ఎంచుకున్నారు.

అనంతరం వీరికి 'నేను టీచర్‌కు థాంక్స్ చెప్పాను'.. 'స్ప్రింగ్ కుడివైపున ఉంది'.. 'తాతగారు నిద్రపోతున్నారు' వంటి పదాలను ఇచ్చి తమ సొంత భాషలోకి అనువాదం చేయమన్నారు. అనంతరం తాము అనువదించిన పదాలను సాధారణ వేగంతో చదవాలని సూచించారు.

ఈ సందర్భంగా పరిశోధనలో పాల్గొన్నవారు అన్ని భాషల్లోకెల్లా తెలుగులోని ఆ పదాలను త్వరగా పలకగలిగారు. ఈ పరిశోధనలో తెలుగు తర్వాత జపనీస్ రెండో స్థానంలో నిలిచింది. ఇందులో భాగంగా వేర్వేరు భాషలు ఒక సమాచారాన్ని ఎంత బాగా అందిస్తున్నాయి? అని గుర్తించే ప్రయత్నం చేశారు. సమాచారాన్ని వేగంగా అందించే భాషల్లో ఇంగ్లిష్ మొదటి స్థానంలో నిలవగా, ఫ్రెంచ్, జర్మన్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

More Telugu News