2 new disticts: తెలంగాణలో మరో రెండు కొత్త జిల్లాలు.. 33కు చేరిన జిల్లాల సంఖ్య!

  • కొత్తగా నారాయణపేట, ములుగు జిల్లాల ఏర్పాటు
  • ఈరోజు తుది నోటిఫికేషన్‌ ఇవ్వనున్న రెవెన్యూ శాఖ
  • రేపటి నుంచి ఉనికిలోకి కొత్త జిల్లాలు

తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33కు చేరింది. కొత్తగా నారాయణపేట, ములుగు జిల్లాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు ఉన్న 31 జిల్లాల సంఖ్య 33కి చేరినట్టయింది. నూతన జిల్లాలకు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను ఈరోజు రెవెన్యూ శాఖ జారీ చేస్తుంది.

గతంలో రాష్ట్రం విడిపోక ముందున్న జిల్లాలను విభజించి మొత్తం 31 జిల్లాలను ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా రెండు జిల్లాల కోసం గత ఏడాది డిసెంబరు 31న ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేసింది. అభ్యంతరాలు, వినతులు స్వీకరించిన అనంతరం ఏర్పాటుకు ఆమోదించింది. నూతన జిల్లాలకు కలెక్టర్లను, ఎస్పీలను, ఇతర అధికారులను నియమించనుంది. ఇదే సమయంలో మరికొన్ని జిల్లాల్లోని కలెక్టర్లకు స్థాన చలనం కలిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

More Telugu News