Pakistan: పాకిస్థాన్ కు తగిన బుద్ధి చెప్పాలి: పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్

  • శాంతి చర్చలు జరపాలని పాక్ ప్రధాని అంటారు
  • యుద్ధం గురించి పాక్ ఆర్మీ చీఫ్ మాట్లాడతారు
  • పాకిస్థాన్ డబుల్ గేమ్ ఆడుతోంది

శాంతి చర్చలు జరిపే సమయం ముగిసిపోయిందని, పాకిస్థాన్ కు తగిన బుద్ధి చెప్పాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ పంజాబ్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ దారుణ ఘటనను ఖండించారు.

 ఈ సందర్భంగా అమరీందర్ సింగ్ మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరపాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంటారని, మరోపక్క, యుద్ధం గురించి పాక్ ఆర్మీ చీఫ్ జావేద్ బజ్వా మాట్లాడటం చూస్తుంటే, పాకిస్థాన్ డబుల్ గేమ్ ఆడుతోందన్నది అర్థమవుతోందని దుయ్యబట్టారు. భారత ప్రభుత్వం ఈ పరిస్థితిని అర్థం చేసుకుని ముందడుగు వేసి ఈ దాడికి దీటుగా పాకిస్థాన్ కు బదులివ్వాలని అన్నారు. 

More Telugu News