KV Guhan: ఆసక్తికరంగా కల్యాణ్ రామ్ ‘118’ ట్రైలర్

  • కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం
  • సంగీతం అందించిన శేఖర్ చంద్ర
  • దర్శకత్వం వహించిన గుహన్

కేవీ గుహన్ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘118’. ఈ సినిమాలో కల్యాణ్‌రామ్ సరసన నివేదా థామస్, షాలినీ పాండే కథానాయికలుగా నటించారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు నిర్మించిన ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ నేడు విడుదల అయింది. టీజర్‌ని బట్టి చూస్తే ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిందని తెలుస్తోంది. నివేదా థామస్ కోసం వెదుకుతూ కల్యాణ్ రామ్ కనిపించాడు. చాలా ఆసక్తికరంగా ఈ ట్రైలర్‌ని రూపొందించి చిత్రబృందం వదిలింది. ఈ సినిమాలో హర్షవర్థన్ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News