ఏపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్న సోమిరెడ్డి!

15-02-2019 Fri 17:16
  • అసెంబ్లీ కార్యదర్శిని కలవనున్న సోమిరెడ్డి
  • తన రాజీనామాపత్రం సమర్పించనున్న టీడీపీ నేత
  • వచ్చే ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి పోటీ

ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నారు. అసెంబ్లీ కార్యదర్శిని కలిసి తన రాజీనామా పత్రం అందజేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా సోమిరెడ్డి పోటీ చేసే అవకాశముండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

కాగా,  గతంలో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి సోమిరెడ్డి మూడుసార్లు పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2004, 2009లలో కాంగ్రెస్ పార్టీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డిపై, 2014లో వైసీపీకి చెందిన కాకాని గోవర్ధన్ రెడ్డిపై పోటీ చేసే ఓటమిపాలయ్యారు. ఈసారి, ఇక్కడి నుంచి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో సోమిరెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది.