nagarjuna: 'మన్మథుడు 2'ను ఆ రోజున లాంచ్ చేస్తారట

  • రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2'
  • వచ్చేనెల 12వ తేదీన లాంచ్ 
  • యూరప్ లో షూటింగ్ కి సన్నాహాలు

నాగార్జున అభిమానులకి ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాలలో 'మన్మథుడు' ఒకటి. విందుభోజనం వంటి ఈ సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ గా 'మన్మథుడు 2' నిర్మితమవుతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సినిమాను ఎప్పుడు లాంచ్ చేస్తారా అని అభిమానులంతా ఎంతో ఆత్రుతగా  ఎదురుచూస్తున్నారు. వచ్చేనెల 12వ తేదీన ముహూర్తం కుదిరినట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారట. కథాపరంగా ఈ సినిమా షూటింగ్ యూరప్ నేపథ్యంలో కొనసాగుతుంది. అందువలన 2 నెలలపాటు అక్కడ షూటింగును ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తోన్న ఈ సినిమాకి, త్వరలోనే కథానాయికను ఫిక్స్ చేయనున్నారు.

More Telugu News