simran: భారీ యాక్షన్ మూవీలో సిమ్రన్ .. త్రిష

  • తమిళంలో పట్టాలెక్కనున్న యాక్షన్ మూవీ
  •  ప్రధాన పాత్రధారులుగా సిమ్రన్ - త్రిష 
  • చెన్నై .. కేరళ .. థాయ్ లాండ్ లో షూటింగ్ 

తెలుగు .. తమిళ భాషల్లో ఇటు సిమ్రన్ కీ .. అటు త్రిషకి మంచి క్రేజ్ వుంది. విభిన్నమైన పాత్రలతో మెప్పిస్తూ ఇద్దరూ కూడా తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇటీవలే ఈ ఇద్దరూ 'పేట' సినిమాలో రజనీతో జోడీ కట్టారు. తాజాగా ఈ ఇద్దరూ ఒక భారీ యాక్షన్ మూవీలో ప్రధాన పాత్రలను పోషించడానికి రంగంలోకి దిగారు. విజయ్ రాఘవేంద్ర నిర్మాతగా .. సుమంత్ రాధాకృష్ణన్ దర్శకుడిగా తమిళంలో ఈ సినిమా రూపొందనుంది. ఇది భారీ యాక్షన్ మూవీ కావడంతో, ఫైట్స్ చేయడంలో సిమ్రన్ .. త్రిష ఇద్దరూ కూడా ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారట. చెన్నై .. కేరళ .. థాయ్ లాండ్ లలో ఈ సినిమా షూటింగ్ ను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

More Telugu News