Tollywood: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను ఎందుకు తీశానంటే.. వీడియోను విడుదల చేసిన రాంగోపాల్ వర్మ!

  • సినిమా వెనుక కారణాన్ని ఎన్టీఆర్ ప్రజలకు చెప్పమన్నారు
  • అందుకే లక్ష్మీస్ ఎన్టీఆర్ ను తెరకెక్కించా
  • ట్విట్టర్ లో స్పందించిన రాంగోపాల్ వర్మ

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవితంపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఇప్పటికే విడుదల చేసిన వర్మ.. సోషల్ మీడియాలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు బాగా ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా రాం గోపాల్ వర్మ ఓ వీడియోను విడుదలచేశారు. తాను ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను ఎందుకు తీశానో ప్రజలకు చెప్పాల్సిందిగా తనను ఎన్టీఆర్ కోరారని వర్మ తెలిపారు. అందుకే ఈ వాయిస్ మెసేజ్ ను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

More Telugu News