India: భారత్ లో ‘ఉగ్ర’ దాడిపై పాక్ ను హెచ్చరించిన అమెరికా

  • ఉగ్రవాదులకు పాక్ మద్దతు ఉపసంహరించుకోవాలి
  • వారికి ఆశ్రయం ఇవ్వడం నిలిపివేయాలి
  • వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ 

భారత్ లో ఉగ్రవాదుల దాడి ఘటన నేపథ్యంలో పాకిస్థాన్ ను అమెరికా హెచ్చరించింది. పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఉగ్రవాదులకు ఇస్తున్న మద్దతును పాక్ వెంటనే ఉపసంహరించుకోవాలని, వారికి ఆశ్రయం ఇవ్వడం నిలిపివేయాలని హెచ్చరించారు. ఈ మేరకు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాదాన్ని నిరోధించే విషయంలో భారత్ కు అమెరికా ఎప్పుడూ అండగా ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

More Telugu News