Karnataka: కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు!

  • రాయచూర్ ఎస్పీకి ఫిర్యాదు చేసిన జేడీఎస్
  • తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారని ఆరోపణ
  • కర్ణాటకలో రసవత్తరంగా మారిన రాజకీయం

కర్ణాటకలో రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. బీజేపీ నేత, మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారని ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి ఇటీవల ఆరోపించారు. ఈ సందర్భంగా కుమారస్వామి టేపులను విడుదల చేయగా, కలకలం రేగింది. ఈ నేపథ్యంలో యడ్యూరప్పపై రాయచూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

బీజేపీలో చేరకుంటే పరిస్థితులు వేరేగా ఉంటాయని యడ్యూరప్ప తమ పార్టీ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని జేడీఎస్ ఎమ్మెల్యే నాగన్న గౌడ కుమారుడు శరణ్ గౌడ రాయచూర్ జిల్లా ఎస్పీ డి.కిశోర్ బాబుకు ఫిర్యాదు చేశారు.

యడ్యూరప్పతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు శివనగౌడ నాయక్, ప్రీతమ్ గౌడ, యడ్యూరప్పకు మీడియా సలహాదారు ఎంబి మరంకల్ తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఓ ఆడియో సీడీని జిల్లా ఎస్పీకి అందజేశారు. దీంతో రాయచూర్ పోలీసులు యడ్యూరప్ప సహా నలుగురిపై కేసు నమోదు చేశారు.

More Telugu News