vijay: విజయ్ ఇంట్రో సాంగ్ ఒక రేంజ్ లో వుంటుందట

  • 'సర్కార్'తో భారీ హిట్ కొట్టిన విజయ్
  • తదుపరి సినిమా అట్లీ కుమార్ తో
  • దీపావళికి భారీ విడుదల      

'సర్కార్' సినిమాతో హీరోగా విజయ్ తన సత్తాను మరోమారు చాటి చెప్పాడు. కొత్త రికార్డులను సృష్టిస్తూ ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఈ సక్సెస్ తెచ్చిన సంతోషంతో ఆయన తన తదుపరి సినిమాను అట్లీ కుమార్ దర్శకత్వంలో మొదలుపెట్టేశాడు. విజయ్ కెరియర్లో 63వ సినిమాగా ఇది నిర్మితమవుతోంది.

 స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విజయ్ కొత్త లుక్ తో కనిపించనున్నాడట. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసేశారు. రెండవ షెడ్యూల్లో విజయ్ ఇంట్రో సాంగును అట్లీ కుమార్ వెరైటీగా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. 100 మంది పిల్లలతో కలిసి ఈ ఇంట్రో సాంగ్ ఉంటుందని అంటున్నారు. డాన్స్ బాగా తెలిసిన పిల్లలను ఈ సాంగ్ కోసం తీసుకుంటున్నారని చెబుతున్నారు. త్వరలోనే ఈ సాంగ్ ను చిత్రీకరించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, ఈ దీపావళికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. 

More Telugu News