modi: చాలా పెద్ద తప్పు చేశారు... భారీ మూల్యం చెల్లించుకుంటారు: మోదీ హెచ్చరిక

  • పుల్వామా దాడి వెనుక ఉన్న శక్తులను చట్టం ముందు నిలబెడతాం
  • అందరిలోనూ రక్తం మరుగుతోంది
  • ఈ సున్నిత సమయంలో అన్ని పార్టీలు రాజకీయాలకు దూరంగా ఉండాలి

పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా పెద్ద తప్పు చేశారని... భారీ మూల్యం చెల్లించుకుంటారని ఆయన హెచ్చరించారు. 'ఉగ్రవాదులు చాలా దారుణానికి పాల్పడ్డారు. పెద్ద తప్పు చేశారు. వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ దాడి వెనుక ఉన్న శక్తులను చట్టం ముందు నిలబెడతాం' అని మోదీ అన్నారు. జరిగిన దారుణంతో అందరి రక్తం మరుగుతోందని చెప్పారు.

ఇది అత్యంత సున్నితమైన సమయమని... ఈ పరిస్థితుల్లో అధికారపక్షం కానీ, విపక్షాలు కానీ రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరారు. దేశం మొత్తం సంఘటితంగా ఉండాలని చెప్పారు. ఇండియాను అస్థిరపరచాలని పొరుగు దేశం భావిస్తున్నట్టైతే, ఆ ఆలోచనను విరమించుకోవాలని... అది ఎప్పటికీ సాధ్యం కాదని అన్నారు. ఢిల్లీలో హై లెవెల్ సెక్యూరిటీ మీటింగ్ అనంతరం మాట్లాడుతూ ఆయన ఈమేరకు హెచ్చరించారు.

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్థాన్ ను ఏకాకిని చేసేందుకు దౌత్యపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాక్ కు కల్పించిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను కూడా ఉపసంహరించామని తెలిపారు.

More Telugu News