putin: పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన రష్యా అధ్యక్షుడు

  • ముష్కరులకు కఠిన శిక్ష పడాలి
  • భారత ప్రజల ఆవేదనను పంచుకుంటున్నాం
  • భారత్ తో కలసి కౌంటర్ టెర్రరిజంను మరింత బలపరుస్తాం

జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడినవారు, వారికి సహకరించిన వారికి కఠిన శిక్ష పడాల్సిందేనని అన్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీలతో ఆయన ఫోన్ ద్వారా మాట్లాడారు. అనంతం ఓ సందేశాన్ని విడుదల చేశారు. కౌంటర్ టెర్రరిజంను మరింత బలపరిచే విధంగా తమ మిత్రదేశం భారత్ తో కలసి పని చేస్తామని చెప్పారు. దాడిలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భారత ప్రజల ఆవేదనను పంచుకుంటున్నామని తెలిపారు. 

More Telugu News