ajith: తెలుగు ప్రేక్షకుల ముందుకు 'విశ్వాసం'

  • తమిళంలో హిట్ కొట్టిన విశ్వాసం
  • తెలుగులో మార్చి 1న విడుదల
  •  ప్రతినాయకుడిగా జగపతిబాబు

అజిత్ కి ఈ ఏడాది ఆరంభంలోనే 'విశ్వాసం' భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. జనవరి 10వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా తమిళంలో భారీ వసూళ్లను రాబట్టింది. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాను అదే సమయంలో తెలుగులోను విడుదల చేయాలనుకున్నారు. అయితే ఆ సమయంలో పోటీ ఎక్కువగా ఉండటం వలన వాయిదా వేసుకున్నారు.

అలాంటి ఈ సినిమాను మార్చి1వ తేదీన విడుడల చేయడానికి రంగం సిద్ధమైంది. తెలుగులో అజిత్ కి మంచి క్రేజ్ వుంది .. ఇక నయనతారకి తెలుగులో పెద్ద సంఖ్యలో అభిమానులు వున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్రను చేసింది జగపతిబాబు కావడం తెలుగు వెర్షన్ కి కలిసొచ్చే ప్రధానమైన అంశం. ఇక ఇదే రోజున విడుదల కానున్న కల్యాణ్ రామ్ '118' సినిమాకి, 'విశ్వాసం' పోటీ ఇచ్చేట్టుగానే కనిపిస్తోంది.

More Telugu News