ఆర్థికమంత్రి వచ్చేశారు... ఎమర్జెన్సీ మీటింగ్ కు అరుణ్ జైట్లీ!

15-02-2019 Fri 09:22
  • కాసేపట్లో అత్యవసర భేటీ
  • ఇప్పటికే ఆర్థిక శాఖ బాధ్యతలు తీసేసుకున్న జైట్లీ
  • ఉగ్రవాదులకు మరచిపోలేని గుణపాఠం చెబుతామని హెచ్చరిక
పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై మరికాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అత్యవసర క్యాబినెట్ మీటింగ్ జరుగనుండగా, ఆర్థికమంత్రి హోదాలో అరుణ్ జైట్లీ సమావేశానికి హాజరు కానున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం అమెరికాకు వెళ్లి తిరిగివచ్చారు. జైట్లీ అమెరికాకు వెళ్లిన తరువాత మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టే బాధ్యతలను పీయుష్ గోయల్ కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇక జైట్లీ ఇండియాకు వచ్చిన వెంటనే, ఆర్థిక శాఖ బాధ్యతలను తిరిగి తీసుకున్నారు. నిన్న ఆయన ఉగ్రదాడిపై స్పందిస్తూ, "ఉగ్రవాదులకు మరచిపోలేని గుణపాఠం చెబుతాం. వారి చర్యలు అత్యంత క్రూరం" అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.